ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్ పూర్తైంది. వర్షం వల్ల 26 ఓవర్లకు మ్యాచ్ కుదించగా భారత్ 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31), చివర్లో నితీష్ (19*) ఆకట్టుకున్నారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, ఓవెన్, కునెమన్ తలో 2 వికెట్లు, స్టార్క్, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ చొప్పున తీశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ముందు 137 పరుగుల లక్ష్యం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa