ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 60 సంవత్సరాలు పైబడిన వినియోగదారుల కోసం 'బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్' పేరుతో ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా రూ.1,812 చెల్లించి 365 రోజుల పాటు అపరిమిత సేవలను పొందవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రూ.1,812కు 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ పొందడానికి వినియోగదారులు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్‌ను సంప్రదించవచ్చు. అయితే, ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకే మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa