ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండె సమస్యల్ని దూరం చేసి ఆరోగ్యంగా ఉంచే ఎక్సర్‌సైజెస్

Life style |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 11:50 PM

ఎక్సర్‌సైజ్ అనగానే జిమ్‌కి మాత్రమే వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా చేయొచ్చు. దీని వల్ల కూడా సరైన రిజల్ట్స్ ఉంటాయి. బరువు తగ్గడమే కాదు. గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది. వర్కౌట్స్ చేయడం వల్ల కొన్ని సమస్యలు దూరమవుతాయి. అలాంటి వాటిలో అధిక బరువు, ఇతర సమస్యలతో పాటు, గుండె సమస్యలు కూడా. అయితే, వర్కౌట్స్ చేయడానికి బయటికెళ్లాలి.డబ్బు పెట్టాలనే ఆలోచనల నుంచి బయటికి రావాలి. అలా కాకుండా కొన్ని వర్కౌట్స్ మన ఇంట్లో చుట్టూ పక్కల పరిసరాల్లో చేయొచ్చు. దీని వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాంటి వర్కౌట్స్ గురించి తెలుసుకుందాం.


బ్రిస్క్ వాక్


నడక అనేది చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్ హార్ట్ హెల్దీ వర్కౌట్. 30 నిమిషాల నడక రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుంది. గుండెని బలంగా చేస్తుంది. మానసిక స్థితిని కూడా సరిగ్గా చేస్తుంది.


ఎలా చేయాలి.


కాస్తా స్పీడ్‌గా కాళ్ళు చేతులు కదుపుతూ స్పీడ్‌గా నడవండి.


చేతులని సహజంగా ఉంచండి. ఇది అప్పర్ బాడీని ఇన్వాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.


మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఇష్టమైన వీడియో చూస్తూ నడవొచ్చు.


వాతావరణం బాగుంటే బయట నడవండి. బయటికి వెళ్లలేనప్పుడు ట్రెడ్‌మిల్‌పై నడవొచ్చు.


సైక్లింగ్


ఇంట్లో స్టేషనరీ బైక్ అయినా లేదా మీ పరిసరాల్లో రైడ్ అయినా, మీ కీళ్ళపై ఒత్తిడి లేకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు సైక్లింగ్ బెస్ట్ ఆప్షన్.


ఇది చాలా మంచిది.


గుండె, కాళ్ళని బలంగా చేస్తుంది.


ఓర్పుని పెంచుతుంది.


ఇంటెన్సిటీ అడ్జెస్ట్ చేయాలి. లైట్ స్పిన్ నుండి హిల్ ఛాలెంజ్ వరకూ అడ్జస్ట్ చేసుకోండి. మొదట్లో కొద్దిపాటి స్పీడ్‌తో 15 నిమిషాల పాటు తర్వాత 30 నుంచి 45 నిమిషాలకి పెంచండి.


డాన్సింగ్


మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి ఎవరూ గమనించట్లేదని డ్యాన్స్ చేయండి. దీంతో మీ హార్ట్ బీట్ పెరుగడమే కాకుండా కేలరీలు బర్న్ అవుతాయి. అంతే కాకుండా ఎండార్పిన్స్ రిలీజ్ అవుతాయి. ​


ఎలా పనిచేస్తుంది. ​


ఇది సహజ కార్డియో వర్కౌట్


స్టామినా, సమన్వయాన్ని పెంచుతుంది.


ఒత్తిడిని తగ్గిస్తుంది.


దీన్ని ప్రయత్నించండి.


ఇంట్లో, భోజనం సమయంలో కాస్తా రెస్ట్ తీసుకోండి.


మీకు నచ్చితే జుంబా, బాల్ రూమ్ క్లాసెస్‌లో చేరండి.


డ్యాన్స్ మీ బ్రెయిన్‌ని కూడా షార్ప్ చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరుకి హెల్ప్ చేస్తుంది.


స్విమ్మింగ్, ఏరోబిక్స్


లో ఇంపాక్ట్ వర్కౌట్స్‌కి వాటర్ బెస్ట్. ఇది బాడీ వెయిట్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. కీళ్ళ కదలికల్ని ఈజీ చేస్తుంది. అదే టైమ్‌లో మీ కండరాలు, గుండెకి మేలు చేస్తుంది. స్విమ్మింగ్ ల్యాప్స్, ఆక్వా జాగింగ్ చేయడం, వాటర్ క్లాస్‌లో చేరడం వల్ల మీరు టోటల్ బాడీ, కార్డియో వర్కౌట్ బెనిఫిట్స్ అందుతాయి.


బెనిఫిట్స్


గుండె, ఊపిరితిత్తులని బలంగా చేస్తుంది.


కండరాలని టోన్ చేస్తుంది.


ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.


ఆర్థరైటిస్, మోకాలి నొప్పి ఉన్న ఎవరికైనా మంచిది.


మీరు స్విమ్మింగ్ చేయకపోయినా నడిచినా కూడా మంచిది. ​


యోగా


యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలీటీ పెరగడమే కాదు. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది. యోగా రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుంది. రక్తపోటుని తగ్గించి, గుండెని ఒత్తిడికి గురిచేసే ఒత్తిడి హార్మోన్లని తగ్గిస్తుంది. ​


బెనిఫిట్స్


శ్వాస, ఆక్సీజన్ ప్రవాహాన్ని మెరుగ్గా చేస్తుంది.


ఒత్తిడి, ఆందోళనని తగ్గిస్తుంది.


మైండ్‌ఫుల్‌నెస్‌ని పెంచి ఎమోషనల్ హార్ట్ హెల్త్‌ని మెరుగ్గా మారుస్తుంది. దీనికోసం కొన్ని పోజెస్ హెల్ప్ చేస్తాయి.


క్యాట్ కౌ స్ట్రెచ్


డౌన్ వార్డ్ డాగ్


వారియర్ 2


బ్రిడ్జ్ పోజ్


డీప్ బ్రీథ్‌తో కంప్లీట్ చేయండి.


ఉదయం 10 నిమిషాల యోగా కూడా మీ రోజుని ప్రశాంతంగా, గుండెని ఆరోగ్యంగా మారుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa