ట్రైన్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు బాపట్ల రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. పూరి – తిరుపతి రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద ఈగల్, ఆర్‌పీఎఫ్ టీమ్‌లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 21 కేజీల గంజాయి పట్టుబడింది. ప్రాథమిక విచారణలో ప్రకాశ్ అనే వ్యక్తి ఒడిశాలోని బరంపూర్ నుంచి కేరళకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa