దేశంలో కొన్ని గుర్తింపు లేని ఫేక్ యూనివర్సిటీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయి. విద్యార్థులను బురిడి కొట్టించి డబ్బులు దండుకుంటున్నాయి. విద్యా శాఖ అధికారుల దాడుల్లో ఇవి బయటపడుతున్నా.. మళ్లీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నకిలీ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులు.. మోసానికి గురవుతున్నారు. తాజాగా ఢిల్లీ కోట్లా ముబారక్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ కాలేజీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నకిలీదని గుర్తించింది. అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని పేర్కొంది. ఈ విద్యా సంస్థ జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని యూజీసీ చెప్పడం గమనార్హం. ఈ యూవనివర్సిటీని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు సంబంధించి ఏ చట్టం కింద ప్రారంభించలేదని తెలిపింది. ఇలాగే దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని వెల్లడించింది.
యూజీసీ గణాంకాలు ప్రకారం దేశవ్యాప్తంగా 22 గుర్తింపులేని యూనివర్సీటీలను నిర్వహిస్తున్నారని స్పష్టమైంది. ఇందులో 9 ఢిల్లీలో ఉన్నాయి. 5 ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉండగా.. మిగిలినవి కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిల్లో ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడించింది. యూజీసీ వెల్లడించిన ఫేక్ యూనివర్సిటీల జాబితా .
నిజమైన వాటిలా పేర్లు..
విద్యార్థులకు అనుమానం రాకుండా.. యూనివర్సిటీల పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలను పోలిన పేర్లను పెడుతున్నారు. నేషనల్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్ వంటి పదాలను యూనివర్సిటీ పేర్లలో ఉపయోగిస్తున్నారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో సంప్రదాయబద్ధమైన విద్యాపథ్, పరిషద్, ఓపెన్ యూనివర్సిటీ వంటి పదాలను వాడుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులను ఆకర్షించడానికి బ్రోకర్ నెట్‌వర్క్‌లు నడిపిస్తున్నారు. గతంలో కూడా యూజీసీ 21 ఫేక్ యూనివర్సిటీల జాబితా వెల్లడించింది.
మీ కాలేజీ ఉందో లేదో చెక్ చేసుకోండి..
ఫేక్ కాలేజీలు విచ్చలవిడిగా పెరుగుతున్నందున.. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. కాలేజీల ఫీజులు, సౌకర్యాలతో పాటు.. అది గుర్తింపు పొందిన విద్యా సంస్థేనా అని చెక్ చేసుకోవాలి. లేదంటే డిగ్రీలు చెల్లకుండా పోతాయి. విద్యార్థులు ఏదైనా విద్యా సంస్థలో చేరే ముందు.. దాని పేరు సెక్షన్ 2(ఎఫ్) లేదా 3 కింద యూజీసీ గుర్తించిన జాబితాలో ఉందో లేదో సరి చూసుకోవాలి. అంతేకాకుండా.. యూనివర్సిటీలు, కాలేజీలు అందించే కోర్సులకు.. ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్‌ఎంసీ వంటి కౌన్సిళ్ల నంచి అనుమతి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలాంటి అనుమతులేవీ లేకుంటే.. అది కచ్చితంగా ఫేక్ కాలేజీ లేదా యూనివర్సిటీ అని గుర్తించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa