హెల్దీ డైట్ అనగానే అందులో రకరకాల ఫుడ్స్‌తో పాటు పాలని కూడా యాడ్ చేస్తారు. దీనికి కారణం ఇందులోని పోషకాలే. చిన్న పిల్లల దగ్గర్నుంచీ పెద్దవారి వరకూ పాలని తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యంగా ఉండడం. బలంగా మారడం వంటివి. చాలా మంది ఫుడ్ తినని టైమ్, ఫాస్టింగ్‌లోనూ పాలు తాగుతారు. దీనికి కారణం అందులోని పోషకాలు ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని అందిస్తాయి. పైగా ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే పాలు తాగమని సూచిస్తారు. అయితే, అందరి శరీరతత్వాలు ఒకేలా ఉండవు కదా. అందుకోసమే కొంతమంది పాలు తాగితే ఆరోగ్యంగా ఉండడం పక్కనపెడితే అనారోగ్య సమస్యలొస్తాయి. అలాంటివారు పాలని అవాయిడ్ చేయాలి. వారెవరో తెలుసుకుందాం.
పాలలో హార్మోన్స్
పాలలో హార్మోన్స్, ఈస్ట్రోజెన్, గ్రోత్ హార్మోన్స్ కొంతమందిని ఎఫెక్ట్ చేస్తాయి. ఎలుకలపై జరిగిన పరిశోధనలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఎక్కువగా ఉండే పాలు తాగితే కొన్నిసమస్యలొస్తాయని తేలింది. ఇదే విషయంలో ఇంకా మానవులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అదే విధంగా, ఎదిగే ఆడపిల్లలకి పాలని తాగిపిస్తే అందులోని కొన్ని హార్మోన్స్ కారణంగా ముందుగానే పీరియడ్స్ వంటి సమస్యలు ఫేస్ చేస్తారని తేలింది.
క్యాన్సర్స్
పాలు తీసుకోవడం వల్ల అండాశయ క్యాన్సర్స్ వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. కానీ, ఇంకా నిరూపణ కాలేదు. కాబట్టి, ఎవరైనా సరే పాలు తాగే ముందుగా డాక్టర్ సలహాతో వారికి సూట్ అవుతాయో లేదో తెలుసుకుని తీసుకోవచ్చు. అయితే పోషకాల గురించి పాలని తీసుకోవాలనుకుంటే ఇతర ప్రత్యామ్నాయాలని ఎంచుకోవచ్చు.
అలర్జీ ఉన్నవారు
కొంతమందికి లాక్టోస్ పడదు. పాలు అలర్జీ కారకమవుతాయి. దీని వల్ల ఇమ్యూనిటీ వంటివాటిపై ఎఫెక్ట్ పడుతుంది. పాలు తాగినప్పుడు కొంతమంది వాంతులు, విరోచనాలు, దద్దర్లు, మలంలో రక్తం వంటి సైడ్ ఎఫెక్ట్స్‌ని ఫేస్ చేస్తారు. అలాంటి వారు పాలని తీసుకోకపోవడమే మంచిది. ఇవి మొదట్లో కామన్‌గా అనిపించినప్పటికీ రాన్రాను ప్రాణాంతకంగా మారతాయి. అంతేకాదు, కొంతమందికి పాలు తీసుకున్నాక శ్వాస సమస్యలు వస్తాయి. అలాంటి వారు పాలు, పాల పదార్థాలైన వెన్న, చీజ్, పెరుగు, పనీర్ వంటి డెయిరీ ప్రోడక్ట్స్‌కి దూరంగా ఉండాలి.
జీర్ణ సమస్యలు
అదే విధంగా, కొంతమందికి పాలు తాగగానే జీర్ణమవ్వవు. దీనికి కారణం లాక్టోస్ ఇంటోలరెన్స్. కొన్నిసార్లు ఇది టెంపరరీ ప్రాబ్లమ్ కావు. ఇన్ఫెక్షన్స్ కారణంగా కూడా ఉండొచ్చు. కానీ, లాక్టోస్ అసహనం ఉన్నవారికి మాత్రం పాలు తీసుకున్నప్పుడల్లా ఉబ్బరం, ఆపానవాయువు, విరోచనాలు జరుగుతుండొచ్చు. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి వేరుగా ఉంటాయి. కొంతమందికి పెరుగు, హార్డ్ చీజ్ వంటివి తీసుకుంటే పర్లేదు. కానీ, ఒక్క చుక్క పాలు తీసుకున్న పడకపోవచ్చు. కాబట్టి, ఇలాంటి సమస్యల్ని గమనించినప్పుడు పాలకి దూరంగా ఉండడమే మంచిది.
కేసిన్ సెన్సిటివిటీ
కేసిన్ అంటే పాలలో ఉండే ప్రోటీన్, కేసిన్ సెన్సిటివిటీ ఉన్నవారికి కూడా పాలు తీసుకుంటే జీర్ణవ్యవస్థలో, శరీరమంతటా మంటగా ఉంటుంది. పాల ఉత్పత్తులు వారికి పడకపోవచ్చు. అలాంటప్పుడు ఓ సారి పాలు తాగకుండా గమనించండి. గమనించి పాలు తాగినప్పుడే సమస్యగా ఉంటే పాలకి దూరంగా ఉండడం మంచిది.
ఐరన్ డెఫిషియెన్సీ
కొంతమందికి పాలు ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ డెఫిషియెన్సీ పెరిగి అనీమియా వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, అలాంటివారు కూడా పాలు తాగకుండా వాటి బదులు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. కొంతమందికి మొటిమలు ఎక్కువగా అవుతుంటాయి. అలాంటి వారు పాలని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పాలలోని లాక్టోస్, కేసిన్‌కి అలర్జీ వంటివి ఉన్నవారికి సమస్యల్ని పెంచుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ మొటిమలు, మచ్చలు వస్తుంటే పాలకి దూరంగా ఉండండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa