భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గాయం కావడంతో ఈ ఏడాది మిగిలిన అన్ని BWF టూర్ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. యూరోపియన్ సిరీస్‌కు ముందు తగిలిన పాద గాయం పూర్తిగా నయంకాలేదని వైద్యులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. "గాయాలు క్రీడాకారుల ప్రయాణంలో భాగం. అవి తిరిగి బలంగా ఎదగడానికి ప్రేరణగా మారుతాయి. డా. వేన్ లాంబార్డ్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నా. త్వరలోనే కోర్ట్‌లోకి తిరిగి వస్తా" అని సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa