రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రూ.410.75 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థికశాఖకు పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు రెండు జీవోలు వేర్వేరుగా విడుదల చేశారు. 2025-26 సంవత్సరానికి టైడ్ గ్రాంట్ కింద తొలి విడతగా ఒక జీవోలో రూ.365.69 కోట్లు.. మరో జీవోలో రూ.45.06 కోట్లు విడుదలకు అనుమతులు ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌లు, 650 మండల పరిషత్‌లు, 13,092 పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa