ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ వణికించింది. పలు జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. తుఫాన్ తీరం దాటినప్పటికీ మరికొన్ని గంటలు దాని ప్రభావం జిల్లాలపై ఉండనుంది. మరోవైపుమొంథా తుఫాన్ ముప్పునేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలలో వారికి కావాల్సిన ఆహారం, ఔషధాలు వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయంతీసుకుంది. తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికీ రూ.1000 ఆర్థిక సాయం అందించనుంది. అయితే పునరావాస కేంద్రానికి వచ్చిన కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే గరిష్టంగా 3 వేల రూపాయలు అందించాలని ఆదేశించింది. తుపాను ప్రభావం ముగిసిన తర్వాత పునరావాస కేంద్రం నుంచి వారు తిరిగి ఇళ్లకు వెళ్లే ముందు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహిస్తున్నారు. అనంతరం కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవులో సీఎం పర్యటిస్తారు.. అలాగే భారీ వర్షాలతో నీటమునిగిన పంట పొలాలను చంద్రబాబు పరిశీలిస్తారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరకులను ఉచితంగా అందించనున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
మరోవైపు మొంథా తుపాను నష్టాన్ని అందరం సమర్థంగా పనిచేసి తగ్గించగలిగామని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరం కలిసికట్టుగా పనిచేశామన్న చంద్రబాబు.. కష్టకాలంలో బాధితులకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.. మరో రెండు రోజులు ఇలాగే పనిచేయాలని సూచించారు. మంత్రులు, అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని.. సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. అలాగే పంటనష్టం వివరాలను నమోదు చేసి.. కేంద్రానికి నివేదిక అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
మరోవైపు మొంథా తుఫాన్ నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. కొండచరియలు రహదారిపై పడటంతో.. ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. పెద్ద డోర్నాలలోని అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను పోలీసులు ఆపివేశారు. శ్రీశైలం వైపు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa