మోంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబుతో కలిసి వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రైతులు వద్ద ఉన్న ఖరీఫ్ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు తుపాన్, భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa