భారత్, అమెరికా దేశాలు 10 సంవత్సరాలపాటు అమల్లో ఉండే కొత్త రక్షణ చట్రం ఒప్పందంపై శుక్రవారం సంతకాలు చేశాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్‌సెత్‌ల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ఎదురుగా భారత్, అమెరికా సంయుక్త బలాన్ని పెంచే దిశగా ఇది ఒక కీలక అడుగు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు సైనిక స్థావరాలు, రవాణా, నిర్వహణ సదుపాయాలను పరస్పరం వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa