ప్రజల భద్రత దృష్ట్యా చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికన్ బుల్ డాగ్, అమెరికన్ పిట్ బుల్, బుల్ టెర్రియర్, కేన్ కోర్సో, డోగో అర్జెంటీనో, రోట్ వీలర్ అనే ఈ ఆరు జాతి కుక్కలను పెంచడాన్ని నిషేధిస్తూ జీఓ జారీ చేసింది. ఈ మేరకు ‘మునిసిపల్ కార్పొరేషన్ చండీగఢ్ పెంపుడు జంతువులు, కమ్యూనిటీ కుక్కల బై-లాస్ 2025’ను నోటిఫై చేసింది. ఇప్పటికే ఈ జాతి కుక్కలను కలిగి ఉన్న యజమానులు 45 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa