AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందడం, పలువురికి గాయాలవ్వడంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. ఇప్పటికే స్థానిక, జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంది. అయితే ఆలయ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa