తమిళనాడు కరూర్‌లో 41 మంది మరణానికి కారణమైన తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దుర్ఘటనకు విజయే ప్రధాన బాధ్యుడని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ "కరూర్‌లో జరిగిన దానికి అందరూ బాధ్యులే, కానీ ఒకరు మాత్రం అత్యంత ప్రధాన బాధ్యులుగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన నేరుగా విజయ్‌ను ఉద్దేశించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ ర్యాలీలోనే ఈ విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారిస్తోంది. అయితే, విజయ్‌ను రాజకీయంగా నియంత్రించేందుకే బీజేపీ ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దించిందని డీఎంకే ఆరోపిస్తోంది. ఈ దుర్ఘటన జరిగినప్పటి నుంచి డీఎంకే నేతలు విజయ్, ఆయన పార్టీ టీవీకేను బాధ్యులను చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa