కింద పడినా తనదే పైచేయి అనే వారిలో పాకిస్తాన్ ముందు ఉంటుంది. ఆ ఉగ్ర దేశం చెప్పే అబద్దాలకు అంతు లేకుండా పోతోంది. ఎన్నిసార్లు పక్కా ఆధారాలతో బుద్ధి చెప్పినా.. భారత్‌పై మాత్రం అక్కసు వెల్లగక్కుతోంది. తాజాగా మరోసారి పిచ్చి ప్రేలాపనలు పేలింది. అఫ్గానిస్తాన్‌తో ఘర్షణల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారత్‌పై నిందలు మోపారు. నిత్యం ఘర్షణలతో పాకిస్తాన్‌ను బిజీగా ఉంచాలని భారత్ వ్యూహాలు పన్నుతోందని పిచ్చి కూతలు కూశారు. ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువైపోయాయి.
ఆపరేషన్ సిందూర్‌తో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్.. ఆ తర్వాత మాట మార్చింది. ట్రంప్ జోక్యం వల్లే యుద్ధం ఆగిందని చెప్పింది. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ ఓవైపు దాడులు ఆపాలని కోరుకుంటూనే.. మరోవైపు అబద్దాలు విపరీతంగా ప్రచారం చేసింది. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో ఘర్షణల విషయంలోనూ పాక్ అలాంటి వ్యూహమే అవలంభిస్తోంది. ఖవాజా పదే పదే భారత్‌పై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. అఫ్గాన్‌తో తాజా ఘర్షణలు ఆపేందుకు ఖతార్, తుర్కియే చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపిన ఖవాజా.. తూర్పు, పశ్చిమ సరిహద్దుల ఘర్షణల్లో తాము నిత్యం నిమగ్నమయ్యేలా భారత్ ప్రణాళికలు రచిస్తోందని పొంతన లేని ఆరోపణలు చేశారు. అఫ్గాన్ ఘర్షణలు, ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ ఆసిఫ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
భారత్, మాతో పరోక్ష యుద్ధం చేస్తోంది..
అఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాలం నుంచి భారత్ తమపై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అవసరమైతే వాటిని బయటపెడతామన్నారు. పాక్, అఫ్గానిస్తాన్ జరిగిన ఘర్షణలకు కూడా భారత్ కారణమంటూ.. అఫ్గానిస్తాన్‌ను పావుగా వాడుకుంటూ.. భారత్ ప్రాక్సీ వార్ చేస్తుందని ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ వ్యవహారం చూస్తుంటే.. దొంగే, దొంగ దొంగ అన్నట్లుంది. స్వాతంత్ర్యం వచ్చింది మొదలు భారత్‌పై పాక్ కక్ష కట్టింది. భారత్‌ను అస్థిరపరచాలని పాక్ చేయని ప్రయత్నం లేదు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్‌లో మారణహోమం సృష్టించింది. ముంబయి పేలుళ్లతో సహా దేశవ్యాప్తంగా జరిగిన బాంబు పేలుళ్లలో పాక్ హస్తం ఉన్నట్లు బయటపడింది. భారత్‌ను ఇరకాటంలో పెట్టేలా.. చైనాతో దోస్తీ చేయడం, అమెరికాకు పావులా ఉపయోగపడటం, సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల బంగ్లాదేశ్‌ను కూడా భారత్‌కు వ్యతిరేకంగా మలిచే ప్రయత్నం చేస్తోంది కుటిల పాకిస్తాన్. ఇన్ని చేస్తూ తిరిగి భారత్‌పైనే ఆరోపణలు గుప్పిస్తోంది. ఇదంతా చూస్తుంటే.. పాక్ కుటిల బుద్ధిని భారత్ మరోసారి పక్కా ఆధారాలతో బయటపెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa