ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేకేఆర్ కెప్టెన్ గా హర్షిత్ రాణా..?

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 10:48 AM

ఐపీఎల్ 2026కు సంబంధించి రోజుకో వార్త తెరపైకి వస్తుంది. ఈ సారి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు హర్షిత్ రాణాను కొత్త కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో గంభీర్ సారథ్యంలో కేకేఆర్ జట్టు పలుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ యాజమాన్యం అతని సలహాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa