ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 నిమిషాలు ఇప్పుడు చెప్పినట్లు చేస్తే చాలు ఫ్యాట్‌ కరిగి బరువు ఇట్టే తగ్గుతారు

Life style |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 10:48 PM

​వర్కౌట్స్ చేయాలంటే ఫిట్‌నెస్ ఫ్రీకర్స్‌లా మరీ రోజూ 4 గంటలకి పైగా జిమ్‌లోనే గడపాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి స్ట్రెస్ కూడా చేస్తే చాలంటున్నారు ఫేమస్ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా. ఎంతోమందిని తన ట్రైనింగ్‌తో ఫిట్‌గా మార్చిన యాస్మిన్ టైమ్ లేని బిజీ పీపుల్ కోసం కూడా కొన్ని వర్కౌట్స్‌ని సజెస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే విషయాన్ని వీడియోలో చెబుతూ పోస్ట్ చేశారు. అందులో ఆమె చెప్పినదాని ప్రకారం రోజుకి 10 నిమిషాల పాటు చేస్తే చాలు. చాలా వరకూ ఫిట్‌గా మారొచ్చు. మొత్తం 5 వర్కౌట్స్‌ని సజెస్ట్ చేస్తూ ఇవి చేయడం వల్ల ఎఫెక్టివ్‌గా మారి మంచి రిజల్ట్ ఉంటుందని చాలా వరకూ బాడీలో పేరుకుపోయిన ఎక్స్‌ట్రా ఫ్యాట్ కరుగుతుంది. ఎక్కువ సేపు చేస్తే రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, జిమ్‌లో గంటలు గంటలు లేదా ఎక్కువసేపు ఎక్సర్‌సైజ్ చేయడం ఇష్టం లేని వారు ఏయే వర్కౌట్స్ చేయాలో తెలుసుకోండి.


లెగ్ పుల్ ఫ్రంట్


ఇది కూడా చేయడం ఈజీనే. దీనికోసం ముందుగా ప్లాంక్‌ పొజిషన్‌లో ఉండాలి. చేతులని పైకి ఉంచాలి. ఇప్పుడు కుడి కాలిని పైకి లేపాలి. తర్వాత కిందికి తీసుకురావాలి. అదే విధంగా ఎడమ కాలిని పైకి లేపి కిందకి తీసుకురావాలి. ఇలా చేస్తుండండి. ఇలా చేస్తున్నప్పుడు కాళ్ళు, చేతులు స్ట్రెయిట్‌గా ఉండాలి. దీంతో చాలా వరకూ కాళ్ళు, చేతుల్లోని మజిల్స్‌కి వర్కౌట్ అయినట్లుగా ఉంటుంది. పైగా కాళ్ళు చేతులు కూడా స్ట్రెచ్ అయినట్లుగా ఉంటుంది.


రోల్ డౌన్


ఇది చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫన్నీగా చిన్న పిల్లలు పాకినట్లుగా ఉంటుంది. అయితే, చూడ్డానికి ఎంత ఈజీగా ఉంటుందో అంతకు మించి బెనిఫిట్స్ ఉంటాయి. దీని వల్ల మనకి స్ట్రెచెస్ చేసినట్లుగా ఉంటుంది. దీనికోసం ముందుగా నిల్చోవాలి. మెల్లిగా నడుముని వంచుతూ చేతులని నేలపై ఆన్చాలి. ఇప్పుడు చేతులని ముందుకు పెడుతూ పాకినట్లుగా ముందు కెళ్తూ ప్లాంక్ పొజిషన్‌లోకి రండి. ఆ తర్వాత మళ్లీ దానినే రివర్స్‌గా చేస్తూ వెనక్కి వస్తూ యథాస్థితికి రావాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే గనుక చాలా వరకూ రిజల్ట్ ఉంటుంది.


స్విమ్మింగ్ టూ హండ్రెడ్స్


మనం బోర్లా పడుకోవాలి. కాళ్ళని చేతుల్ని స్ట్రెయిట్‌గా చాచాలి. అదే పొజిషన్‌లో చేతులు, కాళ్ళు ఈత కొట్టినట్లుగా కదలించాలి. ఇప్పుడే అదే పొజిషన్‌లో వెల్లకిలా తిరిగి అప్పర్ బాడీని పైకి ఎత్తి కొన్ని సెకన్ల పాటు ఉండి వెల్లకిలా పడుకుని మళ్ళీ బోర్లా తిరిగి ఉన్న స్థానంలోనే ఈతకొట్టినట్లుగా కాళ్ళు చేతుల్ని కదలించండి. ఇలా చేయగలిగినన్నీ సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల కూడా చాలా వరకూ బాడీలోని ఫ్యాట్ కరుగుతుంది.


సీటెడ్ స్పైన్ ట్విస్ట్


ఇప్పుడు కూర్చోవాలి. మోకాళ్ళు కాస్తా పైకెత్తి రెండు పాదాల్ని కలపాలి. ఇప్పుడు రెండు చేతుల్ని వెడల్పుగా చాచాలి. ఇప్పుడు లోయర్ బాడీ అలానే ఉంచి అప్పర్ బాడీని కుడివైపుకి, మరోసారి ఎడమవైపుకి తిప్పాలి. ఇలా మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నీసార్లు చేయండి. దీని వల్ల అబ్డామినల్‌పై ప్రెజర్ పడుతుంది. దీంతో చాలా వరకూ కూడా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.


బరువు తగ్గించే వర్కౌట్స్


రోలింగ్ బాల్


ఈ ఎక్సర్‌సైజ్‌‌లో మన బాడీని బాల్‌లా గుండ్రంగా తిరిగేలా చేస్తాం. ముందుగా కూర్చుని కాళ్ళని మడిచి చేతులతో లాక్ చేయాలి. ఇప్పుడు వెనక్కి దొర్లుతూ వస్తుండాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు, గ్యాస్ సమస్యల్లాంటివి తగ్గుతాయి. కూడా. కాబట్టి హ్యాపీగా చేయండి.


ఇవన్నీ కూడా మొదట్లో 10 నుంచి 12 సార్లు చేయడం మంచిది. మీకు అలవాటు అయ్యే కొద్దీ రోజుకి 3 సెట్స్ చొప్పున చేయాలి. దీని వల్ల మీరు వర్కౌట్ చేసినట్లుగా ఉంటుంది. ఎలాంటి గిల్టీ లేకుండా హ్యాపీగా ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa