ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనిల్‌ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు

national |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 02:30 PM

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి మరోసారి సమన్లు జారీ అయ్యాయి. బ్యాంకు మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై నవంబర్ 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం ఎగవేత, ఆ నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ ప్రశ్నించనుంది. గతంలో రూ.17,000 కోట్ల రుణ మోసాలకు సంబంధించిన కేసులోనూ అనిల్ అంబానీని ఈడీ విచారించింది. ఇటీవల గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.7,500 కోట్లను ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa