ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ సమస్యలు వదిలేసి విహారయాత్రలు చేస్తారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 02:36 PM

తుపాను ప్రభావంతో ప్రజలు, అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే... సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ జోడెద్దులా విహారయాత్రలు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తుపాన్ ప్రబావిత ప్రాంతాల్లో వైయస్.జగన్ పర్యటనకు అపూర్వ స్పందన లభించిందని... విపత్తుల సమయంలో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో  జరిగిన మేలును రైతులు పదే, పదే గుర్తు చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను గాడిదలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై చంద్రశేఖర్ తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు కుసంస్కారానికి నిదర్శమని స్పష్టం చేశారు. మరవైపు వైయస్.జగన్ దంపతులను విమర్శించే స్థాయి ఆదినారాయణరెడ్డికి లేదని... నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయనకు  తగిన శాస్తి జరగడం ఖాయమని చంద్రశేఖర్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa