ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లడ్ షుగర్ లెవల్స్ నుంచి బరువు తగ్గడం వరకూ,,, సబ్జా గింజలు తీసుకుంటే ఎన్నో లాభాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 11:03 PM

సబ్జా గింజలు. ఇవి మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. చియా సీడ్స్, సబ్జా గింజలు చూడ్డానికి దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ, వీటి పనితీరు వేరు. వీటిని తీసుకోవడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. జీర్ణ సమస్యల నుంచి మరెన్నో సమస్యల్ని దరం చేసే పవర్ సబ్జా గింజలకి ఉన్నాయి. సబ్జాని మనం రెగ్యులర్‌గా డైట్‌లో యాడ్ చేస్తే మనకి వచ్చే చాలా సమస్యల్ని దూరం చేసుకున్నవారవుతాం. ఈ లాభాల గురించి డాక్టర్ సేథి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. వీటిని తినడం వల్ల బెనిఫిట్స్‌ అందుతాయని, అయితే, కొంతమంది వీటి విషయంలో అపోహలని కూడా నమ్ముతారని అలాంటివాటిని పట్టించుకోవద్దని సూచిస్తున్నారు. ఆయన ప్రకారం సబ్జా సీడ్స్ తీసుకుంటే ఏ లాభాలు ఉంటాయి. ​ కానీ, వీటిని తీసుకుంటే అంతకు మించి లాభాలున్నాయంటూ ప్రచారం ఉంది. అందులో నిజమేంటి? ఏ సమస్యల్ని సబ్జా గింజలు దూరం చేయవో తెలుసుకోండి.


మలబద్ధకం తగ్గేందుకు


అవును, సబ్జా గింజల్ని తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గట్ మైక్రోబయోమ్ పెరుగుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మనకి జీర్ణ సమస్యలైన మలబద్ధకం, అసిడిటీ తగ్గుతాయి. మలబద్ధకంతో బాధపడేవారు సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది. వీటిని మనం నీటిలో నానబెట్టుకుని నీటిలో కలిపి తాగొచ్చు. లేదా ఏవైనా జ్యూస్‌లు, స్మూతీల్లో కూడా కలిపి తీసుకోవచ్చు. వీటిలోని సొల్యూబుల్ ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి.


బరువు తగ్గడం


అవును, సబ్జా గింజల్ని తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఓ టేబుల్ స్పూన్ సబ్జా గింజల్లో 40 నుంచి 50 కేలరీలు ఉంటాయి. ఇవి మనం తీసుకోగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. వీటిలోని ఫైబర్ కారణంగా మనం ఎక్కువగా ఫుడ్ తీసుకోం. పైగా క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. వీటన్నింటి కారణంగా చక్కగా బరువు తగ్గుతారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు సబ్జా గింజల్ని వారి డైట్‌లో యాడ్ చేసుకోవడం మంచిది.


ఎముకల ఆరోగ్యానికి


సబ్జా గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటి కారణంగా చలికాలంలో వచ్చే కీళ్ళ నొప్పులు, మంటలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అయిన ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు.


బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడం


ఎవరైతే షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని బాధపడతారో అలాంటి వారు సబ్జా గింజల్ని రెగ్యులర్‌గా వారి డైట్‌లో యాడ్ చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీనికి కారణం సబ్జా గింజల్లో యాంటీ డయాబెటిస్ గుణాలు ఉండడమే. కాబట్టి, రెగ్యులర్‌గా తీసుకుంటే షుగర్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ తగ్గించుకోవడానికి వీలవుతుంది.


ఎలా తీసుకోవాలి?


మనం సబ్జా గింజల్ని తీసుకునే ముందు వాటిని నీటిలో నానబెట్టాలి. ఎప్పుడు కూడా డ్రైగా అస్సలు తీసుకోవద్దు. నానిన సబ్జా గింజల్ని నీటిలో, జ్యూస్‌లో, స్మూతీస్‌లో ఫలుదా, పెరుగు, ఐస్‌క్రీమ్‌లో కలిపి తీసుకోవచ్చు. అయితే, వీటిని రోజుకి 1 లేదా 2 టీస్పూన్ల పరిమాణంలోనే తీసుకోవాలి. దాదాపు 15 గ్రాముల పరిమాణంలో ఉండేలా తీసుకోవాలి.


సబ్జా గింజలు తింటే లాభాలు


ఎక్కువగా తీసుకుంటే


అయితే, సబ్జా గింజల్ని మనం డ్రైగా తీసుకున్నా లేదా తీసుకోవాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా తీసుకున్నా కూడా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి, వీటిని ఎప్పుడు కూడా మోతాదులోనే తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెరుగతాయని, డిప్రెషన్ తగ్గుతుందని కొన్ని తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిని నమ్మాల్సిన అవసరం లేదని డాక్టర్ సేథి చెబుతున్నారు. గమనిక


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa