ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందారు. పోలీసులు యూఏపీఏ, ఎక్స్‌ప్లోసివ్ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అనుమానితుడు డాక్టర్ ఉమర్ అహ్మద్ ఫొటో బయటకు వచ్చింది. ఉమర్‌కు ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కారులో అమ్మోనియం సైట్రేట్, డిటోనేటర్లు ఉన్నట్లు తేలింది. కారులోని మృతదేహం ఉమర్‌దే అన్న అనుమానంతో పోలీసులు డీఎన్ఏ శాంపిల్ సేకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa