స్క్వాట్స్ అనేవి మంచి వర్కౌట్. ఇది ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ చేస్తారు. కాబట్టి, అలాంటి అథ్లెట్స్ మాత్రమే చేయాల్సిన పనిలేదు. వీటిని మనం రెగ్యులర్ వర్కౌట్ రొటీన్‌లో యాడ్ చేస్తే లోయర్ బాడీ స్ట్రెంథ్‌గా మారుతుంది. దీని వల్ల మీ గ్లూట్స్, క్వాడ్రిసెప్స్ బలంగా మారతాయి. అంతేకాకుండా, స్క్వాట్స్ చేసినప్పుడు కోర్ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీంతో కోర్ భాగంలోని ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. వీటిని చేయడం వల్ల తుంటి కండరాలు, కాల్వ్స్, హామ్ స్ట్రింగ్స్ వంటి భాగాల్లో పేరుకుపోయిన కేలరీలు బర్న్ అవుతాయి. వీటి వల్ల బరువు కూడా తగ్గుతారు. వీటిని చేయడం వల్ల మోకాలు, చీలమండలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. దీంతో ఎక్కువగా గాయలవ్వవు. నొప్పులు ఉండవు. వీటిని చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటే..
ఎముకల్లో బలం
స్క్వాట్స్ చేయడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ముఖ్యంగా, వెన్నెముక, లోయర్ బాడీ బలంగా మారుతుంది. దీని వల్ల ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. దీని వల్ల మీ కండరాలు, స్నాయువులు స్ట్రెచ్ అవుతాయి. దీంతో నడిచేటప్పుడు కాళ్ళు పట్టేయడం, పిక్కలు పట్టేయడం వంటి సమస్యలు ఉండవు. అందుకే, రెగ్యులర్‌గా వీటిని చేయడం మంచిది.
తొడల లావు తగ్గడానికి
స్క్వాట్స్ చేయడం వల్ల మీ లోయర్ బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. దీని వల్ల కాళ్ళు, పిరుదుల్లోని ఫ్యాట్ కరిగి సన్నగా మారతాయి. దీనికి కారణం గ్లూట్, లోపలి తొడ కండరాలపై స్క్వాట్స్ చేసేటప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. దీంతో పిరుదులు దృఢంగా మారతాయి. పోశ్చర్ కూడా మెరుగ్గా మారుతుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గడం
ఈ స్క్వాట్స్ చేసినప్పుడు కోర్‌పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల కోర్ భాగంలో ఫ్యాట్ కరిగి బలంగా మారుతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ చాలా వరకూ తగ్గుతుంది. రెగ్యులర్‌గా చేసేవారికి బెల్లీ అనేది పెరగదు. దీంతో పాటు కేలరీలు కూడా కరుగుతాయి. ఈ కారణంగానే బరువు తగ్గుతారు. దీంతో పాటు కాళ్ళు బలంగా మారతాయి. రోజూ సరిగ్గా స్క్వాట్స్ చేస్తే ఫిజికల్‌గా ఫిట్‌గా మారతారు. బాడీలో సరైన మార్పులు కనిపిస్తాయి. పొత్తికడుపు కండరాలు బలంగా మారతాయి.
స్క్వాట్స్ చేయడం వల్ల కలిగే ముఖ్య లాభాల్లో ఒకటి గుండె ఆరోగ్యం. దీనికి కారణం బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ కారణంగా రక్తంలో ఆక్సీజన్ సరఫరా మెరగవుతుంది. దీంతో గుండె సమస్యలు దూరమై గుండె ఆరోగ్యం మెరగవుతుంది. అంతేకాకుండా, వెన్నునొప్పి తగ్గుతుంది.
స్క్వాట్స్ చేస్తే బెనిఫిట్స్
జీర్ణ సమస్యలు
స్క్వాట్స్ చేయడం వల్ల కోర్ హెల్దీగా మారుతుంది. పేగు కండరాలు బలంగా మారతాయి. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిని రెగ్యులర్‌గా చేయడం వల్ల అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సరైన స్ట్రెచెస్ చేసినట్లుగా హెల్ప్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa