పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుకు భద్రతను పెంచారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందగా 36 మంది గాయపడ్డారు. దీంతో ఆ జట్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్ హోంశాఖ మంత్రి మోషిన్ నఖ్వీ శ్రీలంక క్రికెట్ అధికారులతో చర్చించి, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ పేలుడుకు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వమే కారణమని పాక్ ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa