బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. బీహార్‌లో ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికలు మొదటి నుంచి న్యాయంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే తమ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు.రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఫలితాలను సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జరుగుతున్న పోరాటమని ఆయన వ్యాఖ్యానించారు. మహాఘట్‌బంధన్‌పై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa