తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ప్రకటించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, 2026 జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 19న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa