మఖానాను పోషకాల ఖజనా అంటారు ఎక్స్పర్ట్స్. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిని సూపర్ ఫుడ్ అన్నారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అద్భుతమైన చిరు తిండి. ఇది తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది.
మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. ఇక, శీతాకాలంలో ఇది పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్. చలికాలంలో నెయ్యిలో వేయించిన మఖానాను తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ చెప్పారు.
నెయ్యిలో వేయించిన మఖానా ఆరోగ్యకరమైన ఎంపిక అని డాక్టర్ అంటున్నారు. రుచికి రుచి అందించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిలో వేయించిన మఖానాను రోజూ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో డాక్టర్ చెప్పారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మఖానాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. వాటిని నెయ్యిలో వేయించడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇది జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మంచి స్నాక్ ఐటమ్.
బరువు తగ్గడంలో సాయపడుతుంది
నెయ్యిలో వేయించిన మఖానా తినడం వల్ల బరువు తగ్గవచ్చని డాక్టర్ అంటున్నారు. నెయ్యిలో వేయించిన మఖానాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పోషకాలు అధికంగా ఉంటాయి. వాటిలో అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీంతో ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ తినడాన్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది.
ఎముకలు స్ట్రాంగ్
మఖానాల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల్ని బలపేతం చేయడానికి సాయపడతాయి. నెయ్యిలో వేయించిన మఖానాలు నెల పాటు తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా మారతాయని డాక్టర్ అంటున్నారు. అంతేకాకుండా కీళ్ళు ఫ్లెక్సిబుల్ అవుతాయి.
రక్తంలో షుగర్ కంట్రోల్
మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన స్నాక్ ఐటమ్. వీటిని నెయ్యిలో వేయించుకుని తింటే మరింత ప్రయోజనాలు చేకూరతాయి.
హార్మోన్ల సమతుల్యం
మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సాయపడతాయి. ఇది మహిళల్లో రుతుక్రమ అసమానతలు, రుతువిరతి లక్షణాల్ని తగ్గించడంలో సాయపడుతుంది. మహిళల్లో ల్యుకోరియాకు కూడా సాయపడుతుంది. మహిళల్లో రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. అందుకే ఈ కాంబినేషన్ మహిళలకు సూపర్ ఫుడ్ అని డాక్టర్లు అంటున్నారు.
ఇతర ప్రయోజనాలు
నెయ్యి, మఖానాలో మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెరిసే చర్మాన్ని, బలమైన జుట్టును ప్రోత్సహిస్తాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముడతల సమస్య కూడా తగ్గుతుంది.
మఖానాలో ఉంటే పొటాషియం, నెయ్యిలో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె వ్యాధుల నుంచి రక్షించడంలో సాయపడతాయి.
మఖానాను నెయ్యితో కలిపి తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.
ఎలా తినాలి?
ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక గిన్నెలో మఖానాను తీసుకుని.. నెయ్యిలో తక్కువ మంట మీద తేలికగా వేయించాలి. కావాలంటే కొంచెం ఉప్పు లేదా కారం వేయించుకుని తినవచ్చు. దీని అవాయిడ్ చేయడమే మంచిది. వీటిని ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు. ఇక, ఎక్కువ మోతాదులో తినకూడదు. డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడేవారు నెయ్యిని తక్కువ మోతాదులో తీసుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa