AP: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. రానున్న మూడు నాలుగు నెలల్లో స్థానిక ఎన్నికలు రానున్నాయని, కావున నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ సిద్ధం కావాలని చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం లబ్ధిని (47 లక్షల మంది రైతులు) పది రోజుల్లో ఇంటింటికీ వివరించాలని, 'సూపర్ సిక్స్', ఇతర కొత్త పథకాల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి స్థానిక ఎన్నికలకు వెళ్తాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa