ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. కంధమాల్ జిల్లాలోని ముసుమహపాడ గ్రామంలో చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు బిగిల్ ప్రధాన్ మృతి చెందాడు. దరింగ్‌బాడి బ్లాక్‌లోని బ్రాహ్మణి పోలీస్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, తండ్రి తీసుకొచ్చిన చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న బొమ్మ తుపాకీతో బాలుడు ఆడుకుంటూ.. అనుకోకుండా మింగేశాడు. తల్లిదండ్రులు తొలగించేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa