రైలు ప్రయాణంలో ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తినడం లేదా స్టేషన్లలో దొరికే వేడివేడి పదార్థాలను తీసుకోవడం సాధారణమే. కానీ, ఓ మహిళ ఏకంగా రైలు ఏసీ కోచ్‌లోనే వంట చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ రైలు ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని చార్జింగ్ సాకెట్‌లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి మ్యాగీ వండుకుంది. అంతేకాకుండా, ఆమె ఎంతో సంతోషంగా కెమెరాకు పోజులివ్వడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa