దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. శనివారం ఉదయం ఏక్యూఐ 359గా నమోదై, ఎక్కువ ప్రాంతాల్లో ‘పూర్’ స్థాయికి చేరింది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 50% ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలల్లో ఆరుబయట కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ ఆదేశాలు సుప్రీం కోర్టు సూచనల ఆధారంగా జారీ చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, క్రీడా సంస్థలకు కూడా వర్తిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa