జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) సమీపంలో ఉన్న ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌పై ఈ ఏడాది మే 6 రాత్రి పాకిస్థాన్ నుంచి డ్రోన్ దాడి జరిగింది. శత్రు దేశం ఈ కీలక విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో పేలుడు పదార్థాలను పంపే ప్రయత్నం చేసింది. అయితే సీఐఎస్ఎఫ్ యూనిట్-ఉరి సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటన వివరాలను సీఐఎస్ఎఫ్ అధికారికంగా బయటపెట్టింది.
పాకిస్థాన్ రేంజర్లు LoC వెంబడి తీవ్ర కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల మధ్య పక్కనే ఉన్న గ్రామస్తుల ప్రాణాలను కాపాడేందుకు సీఐఎస్ఎఫ్ జవాన్లు అసాధారణ ధైర్యం ప్రదర్శించారు. డ్రోన్లను కాల్చి కూల్చడం, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, శత్రు కాల్పులను ఎదుర్కొని స్థావరాన్ని కాపాడటం – ఒకేసారి మూడు రకాల బెదిరింపులను వీరులు తట్టుకున్నారు.
ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న 19 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి నిన్న ఢిల్లీలో జరిగిన సీఐఎస్ఎఫ్ డే కార్యక్రమంలో ప్రత్యేక అవార్డులు అందజేశారు. వీరిలో కొందరు డీజీ డిస్క్‌లు, కొందరు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉరి యూనిట్ ధైర్యసాహసాల గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది సీఐఎస్ఎఫ్.
దేశ విద్యుత్ ధోరణిని, అత్యంత సున్నితమైన సరిహద్దు ప్రాంత ప్రజల భద్రతను ఒకేసారి కాపాడిన ఈ ఘటన సీఐఎస్ఎఫ్ చరిత్రలో మరపురాని అధ్యాయంగా నిలిచిపోయింది. “శత్రువు ఎంతటి కుట్ర చేసినా… మా జవాన్లు రాజీలేని రక్షణ అందిస్తారు” అని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా గర్వంగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa