జేపీ మోర్గాన్ తాజా నివేదిక ప్రకారం, వచ్చే రెండేళ్లలో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు సరఫరా భారీగా పెరగబోతోంది. OPEC+ సభ్య దేశాలు, అలాగే non-OPEC దేశాలు (అమెరికా, బ్రెజిల్, గయానా వంటివి) భారీ ఎత్తున ఉత్పత్తిని పెంచుతున్నాయి. దీనికి తోడు షేల్ ఆయిల్ టెక్నాలజీలో వచ్చిన పురోగతి కూడా సరఫరాను ఆకాశానికి ఎత్తనుంది. ఫలితంగా ప్రస్తుత డిమాండ్-సప్లై గ్యాప్ పూర్తిగా తొలగిపోతుందని అంచనా.
ఈ అతి సరఫరా పరిస్థితి కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు తీవ్రంగా కుంగిపోనున్నాయి. ప్రస్తుతం బారెల్‌కు సుమారు $60–65 మధ్య ఉన్న ధర, 2026 చివరి నాటికి $40 దిగువకు, ఆ తర్వాత FY2027 చివరి నాటికి $30–35 శ్రేణికే చేరుకునే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ బులిష్‌గా అంచనా వేసింది. గతంలో 2015–16లో చూసినట్టు మళ్లీ “ఆయిల్ గ్లట్” పరిస్థితి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌కు ఈ పరిణామం భారీ వరం కాబోతోంది. ఏటా సుమారు $150–160 బిలియన్ల చమురు బిల్లు గణనీయంగా తగ్గడంతో ద్రవ్యలోటు (కరెంట్ అకౌంట్ డెఫిసిట్) భారీగా తగ్గుతుంది. రూపాయి బలోపేతం కావడం, దిగుమతి ఖర్చు ఆదా కావడం వంటి ప్రయోజనాలు పక్కన పెడితే, సామాన్యుడికి కూడా ఈ లాభం అందనుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15–25 వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) అదుపులోకి వచ్చి, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుంది. “చమురు ధరలు ఈ స్థాయిలో తగ్గితే భారత్ ఎకనామిక్ గ్రోత్ మళ్లీ 8 శాతం దాటే అవకాశం ఉంది” అని పలువురు ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa