అమరావతిలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్లతో కూడిన ఈ కమిటీ, జరీబు-మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూముల రైతుల సమస్యలపై చర్చించింది. సమస్యలను త్వరగా పరిష్కరించాలని, రైతులకు ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa