టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పదవి నుంచి తొలగిస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ వర్గాలు తెరదించాయి. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన నేపథ్యంలో గంభీర్‌పై వేటు వేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ లేదని, అతనికి పూర్తి మద్దతుగా నిలుస్తామని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.గత ఏడాది కాలంలో భారత జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిపోవడం ఇది రెండోసారి కావడంతో గంభీర్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు రెడ్-బాల్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించవచ్చని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ వాదనలను బీసీసీఐ వర్గాలు తోసిపుచ్చాయి. "గంభీర్‌ను మార్చే ఆలోచన ప్రస్తుతానికి లేదు. అతను జట్టును పునర్నిర్మిస్తున్నాడు. అతని కాంట్రాక్ట్ 2027 ప్రపంచకప్ వరకు ఉంది" అని ఆ వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa