దేవతల రాజధాని నమూనాతో ఏపీ రాజధాని అమరావతి నిర్మితమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఈ పవిత్ర కార్యక్రమానికి సహకరించిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. గురువారం అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనుల్లో భాగంగా ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణం, మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa