బీహార్‌లోని సీతామఢీ జిల్లాలో హెచ్‌ఐవీ మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఏకంగా 7,400 మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారిక నివేదిక వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, బాధితుల్లో 400 మంది చిన్నారులు కూడా ఉండటం.జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. వైరస్ బారిన పడిన చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచే ఈ వ్యాధి సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్‌ఐవీ ఉన్నా, పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వారు వివరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa