దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన, విషపూరితమైన పొగమంచు కమ్మేయడంతో..వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కఠినమైన అమలు చర్యలను ప్రకటించింది. ఈ చర్యలు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-IVలో భాగమని, ఇది కాలుష్య వ్యతిరేక చర్యలలో అత్యున్నత స్థాయి నియంత్రణ అని పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మంగళవారం తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ మంత్రి సిర్సా మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 18వ తేదీ గురువారం రోజ నుంచి అమలులోకి వచ్చే రెండు ప్రధాన ఆంక్షలను ప్రకటించారు. సరైన లేదా అప్‌డేట్ చేసిన కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ (PUCC) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వబడదని తెలిపారు. అయితే ఈ నిబంధనను కెమెరా ఆధారిత వ్యవస్థల ద్వారా పర్యవేక్షిస్తారు.
BS-VI ప్రమాణాల కంటే తక్కువ ప్రమాణాలు ఉన్న ఢిల్లీయేతర (నాన్-ఢిల్లీ) ప్రైవేట్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. దీని వల్ల GRAP-IV కింద.. అత్యవసర సేవల్లో లేని ట్రక్కులు, వాణిజ్య వాహనాలకు నగరంలోకి ప్రవేశం నిరాకరిస్తారు. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలను మంత్రి సిర్సా వివరించారు. ల్యాండ్‌ఫిల్ సైట్‌ల ఎత్తును 15 మీటర్లు తగ్గించామని, సుమారు 8,000 పరిశ్రమలను కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనల కిందకు తీసుకువచ్చామన్నారు. అంతేకాకుండా కాలుష్యానికి పాల్పడిన పరిశ్రమలకు రూ. 9 కోట్ల జరిమానా విధించామని చెప్పారు. అలాగే ఉడ్ బర్నింగ్ తగ్గించడానికి 10,000 హీటర్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు.
అయితే ఈ కాలుష్య సమస్యకు మంత్రి పరోక్షంగా గత ప్రభుత్వాల వైఫల్యమే కారణమని ఆరోపించారు. "కాలుష్య వ్యాధిని పాత ప్రభుత్వమే వారసత్వంగా ఇచ్చింది. ఇప్పుడు కాలుష్యాన్ని వ్యాప్తి చేసిన వారే నిరసనలు చేస్తున్నారు" అని గత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సిర్సా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాని కూడా ప్రశ్నించారు. గాలి నాణ్యతలో క్రమంగా మెరుగుదల ఉందని.. గత 11 నెలల్లో ఎనిమిది నెలలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మెరుగైన గాలి నాణ్యతను నమోదు చేశాయని తెలిపారు.
"కాలుష్యాన్ని ఏడు, ఎనిమిది నెలల్లో పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదు. ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను" అని కూడా ఆయన సిర్సా చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఒక రోజు ముందు 498 ('తీవ్రమైన') నుంచి మంగళవారం ఉదయం 377 ('చాలా పేలవం')కి మెరుగు పడిందిృన్నారు. వాహన ఉద్గారాలను తగ్గించడానికి 3,427 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టినట్లు మంత్రి తెలిపారు. 62 కాలుష్య హాట్‌స్పాట్‌లను గుర్తించామని.. వీటిపై నిరంతర నిఘా ఉంచామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa