తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 23న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నందున, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అదే రోజు ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవ కూడా రద్దు చేయబడింది. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa