ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'ముస్తాబు' అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.గతంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసి సత్ఫలితాలు సాధించారు. అక్కడి విజయంతో స్ఫూర్తి పొందిన ప్రభుత్వం, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలతో పాటు గురుకులాలు, వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లోనూ 'ముస్తాబు'ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa