తిరుమలలో అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27,28,29 తేదీలకు సంబంధించిన శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీని టీటీడీ అధికారులు రద్దు చేశారు. తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్‌లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ఈ టికెట్లు జారీ చేయబడవని అధికారులు తెలిపారు. భక్తులు తమ దర్శన ప్రణాళికలను దీనికి అనుగుణంగా రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 72,355 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లుగా నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa