పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం విషయం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మా్ణంతో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంటే.. ప్రభుత్వ ఆస్పత్రులను కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. కోటి సంతకాల కార్యక్రమం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతోంది. ఈ క్రమంలోనే తొలివిడతగా మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణానికి సెప్టెంబర్ 18న టెండర్లు పిలిచారు. అయితే కేవలం ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి మాత్రమే కిమ్స్ ఆస్పత్రి.. టెండర్ దాఖలు చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కిమ్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియలో తాము పాల్గొనలేదని కిమ్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆదోని మెడికల్ కాలేజీ కోసం టెండర్ వేశామన్న వార్తల్లో నిజం లేదంటూ కిమ్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. టెండర్లు వేయాలనే ఆలోచనే తాము చేయలేదని కిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ఇటీవల సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్ష కార్యక్రమంలో.. టెండర్ల ప్రక్రియపై అధికారులు చంద్రబాబుకు అప్డేట్ ఇచ్చారు.
రెండు ప్రీబిడ్ సమావేశాల్లో.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆరు పాల్గొన్నాయని.. కొందరు ప్రాజెక్టు స్థలాన్ని కూడా సందర్శించాలని చంద్రబాబుకు అధికారులు వివరించారు. అయితే పరిస్థితులు అంచనా వేసేందుకు కొంత గడువు కోరినట్లు సీఎంకు వివరించారు. ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఓ సంస్థ ముందుకొచ్చిందని అధికారులు చంద్రబాబుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కిమ్స్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే టెండర్లు వేయాలనే ఆలోచనే లేదని కిమ్స్ క్లారిటీ ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది.
తగ్గేది లేదంటున్న చంద్రబాబు..
మరోవైపు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వెనుకడుగు వేసేది లేదని చంద్రబాబు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉందని.. పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందుతుందని చంద్రబాబు చెప్తున్నారు.. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. పీపీపీ విధానంపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని స్పష్టం చేశారు.
పీపీపీనే ఉత్తమం అంటున్న కేంద్రం
మరోవైపు ఆరోగ్య సేవలు, మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానం అనుసరించాలని కేంద్రం చెప్తోంది. ఈ విధానంలో చేపట్టే ప్రాజెక్టులకు మూలధన వ్యయంలో 40 శాతం వరకూ , నిర్వహణ వ్యయంలో 25 శాతం వరకు గ్రాంటుగా అందిస్తామని.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, ఆరోగ్య సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తోందని, రాష్ట్రం కూడా అందిపుచ్చుకోవాలంటూ.. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa