ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతబాబు బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 01:46 PM

ఎమ్మెల్సీ అనంతబాబు తనను హతమారుస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, అటువంటి హెచ్చరికలకు తాను బెదిరే ప్రసక్తే లేదని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి తేల్చిచెప్పారు. టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఎమ్మెల్సీ తీరుపై నిప్పులు చెరిగారు.ప్రశాంతంగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో హత్యా రాజకీయాలను ప్రవేశపెట్టిందే వైసీపీ అని శిరీషాదేవి ఆరోపించారు. తన సొంత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన చరిత్ర అనంతబాబుదని ఎద్దేవా చేశారు. ‘అమెరికాలో ఉండి నేను కనుసైగ చేసినా నువ్వు ఎగిరిపోతావు’ అని అనంతబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వ్యంగ్యంగా మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.ఏజెన్సీలో బినామీల పేరుతో క్వారీలు, రంగురాళ్ల తవ్వకాలు, కలప, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడించింది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తనపై, తన భర్తపై అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa