AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కరెంట్ ఛార్జీల విషయంలో ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని తానే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు APERCకి అధికారులు లేఖ రాశారు. గతంలో సెప్టెంబర్లో ₹923 కోట్లను కూడా ప్రభుత్వం ట్రూడౌన్ చేసింది. ఈ నేపథ్యంలో, గత నవంబర్ నుంచి ట్రూడౌన్లో భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్పై 13 పైసలు తగ్గింపు అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa