ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ దోవల్, సెల్‌ఫోన్ అస్సలు వాడరట.. కారణం ఏంటో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 07:21 PM

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌‌ను.. అందరూ ఇండియన్ జేమ్స్‌బాండ్ అంటారు. నిజానికి ఆయన నిజజీవితం దానికి దగ్గరగానే ఉంటుంది. ఆయన చేసిన సహసోపేతమైన ఆపరేషన్లు ఆయున్ను ఇండియన్ జేమ్స్ బాండ్ చేశాయి. పాకిస్థాన్ వీధుల్లో మాసిన గెడ్డం, చిరిగిన దుప్పటితో.. బిచ్చగాడి వేషంలో 1980వ దశకంలో ఒకటి రెండు కాదు ఆరేళ్ల పాటు తిరిగారు అజిత్ దోవల్. దాయాది పాక్ అణు రహస్యాలను బట్టబయలు చేశారు. అయితే తాజాగా ఈ భారత గుఢచారి గురించి ఓ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అజిత్ దోవల్ ఫోన్‌, ఇంటర్నెట్ అస్సలు వాడరట. ఆ వివరాలు..


శనివారం (జనవరి 10) జరిగిన వికసిత్ భారత్‌ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, తాను ఇంటర్నెట్‌ ఉపయోగించననే మాట నిజమే అని అజిత్ దోవల్ వెల్లడించారు. ఫోన్ కూడా వాడనని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, ఇతర దేశాల్లోని ప్రజలతో మాట్లాడేందుకు కొన్ని.. సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తాని చెప్పారు. అది కూడా అవసరం అనుకుంటేనే వాడతానని చెప్పారు. ప్రతిరోజు ఈ రెండు లేకుండా తన పనులు చేసుకునేలా నిర్వర్తించేలా ప్రాణాళిక వేసుకుంటానని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. అయితే కమ్యూనికేషన్‌ కోసం చాలా మార్గాలు ఉన్నాయని.. అందులో ప్రజలకు తెలియనివి చాలా ఉన్నాయని దోవల్ అన్నారు.


ఉత్తరాఖండ్‌లో 1945లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్‌లో చేరారు. విధుల్లో చూపిన ధైర్యసాహసాలకుగానూ.. కీర్తిచక్ర అందుకున్న అతి పిన్న పోలీస్ అధికారిగా నిలిచారు అజిత్ దోవల్. మిజోరం, పంజాబ్‌, ఈశాన్య ప్రాంతాల్లో చోటుచేసుకున్న తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించారు ఈ భారత గుఢచారి. కేరళ క్యాడర్‌కు చెందిన అజిత్ దోవల్.. నిఘా, అంతర్గత భద్రతా విభాగాల్లో ఎక్కువకాలం పనిచేశారు. అంతేకాకుండా జాతీయ భద్రతా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు.


1999లో కాందహార్ IC-814 ప్లేన్ హైజాక్ సందర్భంగా.. చర్చల్లో పాల్గొన్న వారిలో దోవల్ ఒకరు. దీంతో ప్యాసింజర్లు సురక్షితంగా విడుదలయ్యారు. అంతేకాకండా దాదాపు 15 హైజాక్ కేసులను చాకచక్యంగా హ్యాండిల్ చేశారు దోవల్. ఇక 2016 సర్జికల్ స్ట్రైక్స్‌, 2019 బాలాకోట్ స్ట్రైక్స్‌‌లో కుడా కీలక వార్త పోషించారు. ప్రస్తుతం ప్రధానికి ఐదో జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa