అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 7 గ్రామాల్లో సుమారు 16,666 ఎకరాలు భూసమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలు ఉండగా.. మిగిలిన 3 గ్రామాలు(వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి) గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 7 గ్రామాలకు గానూ 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం ప్రభుత్వం ఈ భూములను సేకరిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa