దేశీయంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, దిగుమతులపై ఆధారపడటాన్ని నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఎరువుల స్వావలంబన మిషన్’ పేరుతో ఒక భారీ పథకాన్ని రాబోయే బడ్జెట్లో ప్రకటించనుంది. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ఎరువుల దిగుమతులను 20 శాతం, పదేళ్లలో 35 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎరువుల విక్రయాలు రికార్డు స్థాయిలో 655.94 లక్షల టన్నులకు చేరాయి. ఈ మిషన్లో భాగంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, జీవ ఎరువుల ప్రోత్సాహం, తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడినిచ్చే కొత్త వంగడాల అభివృద్ధి వంటి చర్యలు చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa