లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యువతలో పెరుగుతున్న ఈ ధోరణితో తలెత్తుతున్న న్యాయపరమైన చిక్కులపై కోర్టు ఘాటుగా స్పందించింది. రిలేషన్‌షిప్ బ్రేక్ అయినప్పుడు మహిళలు అత్యాచార ఆరోపణలు చేయడం ట్రెండ్‌గా మారిందని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నా, అవి లివ్-ఇన్ రిలేషన్‌షిప్ లేని కాలంలో రూపొందించబడ్డాయని గుర్తు చేసింది. చంద్రేష్ అనే వ్యక్తిపై కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలపై జీవిత ఖైదు విధించిన కేసులో, బాధితురాలు మేజర్ అని, ఆమె ఇష్టపూర్వకంగానే నిందితుడితో వెళ్లినందున ఆరోపణలు చెల్లవని తేల్చి చెప్పింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ఫెయిల్ అయిన ప్రతిసారీ దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ, చంద్రేష్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa