నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తన జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ గౌరవం కేవలం తనకు మాత్రమే కాదని తెలుగు హాస్యానికి వినోదాన్ని ఆస్వాదించే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కళలను గౌరవించి తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.గత 48 ఏళ్లుగా ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమే ఈ స్థాయి గుర్తింపునకు కారణమని ఆయన అన్నారు.నాలాంటి నటుడిని మీ ఇంటి మనిషిలా ఆదరించి నటకిరీటి'ని చేసి ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉండమని దీవించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa