చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో, ఇండియాలో వివో ఎక్స్200టి పేరుతో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డెమెన్సిటీ 9400+ ప్రాసెసర్, 6200 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్, 40 వాట్స్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ ధర రూ.59,999, రూ.69,999గా నిర్ణయించారు. ఫిబ్రవరి 3 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa