విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ ఇండియా 50 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ధీమాగా ఉన్నాడు. ఈ ఓటమి తమకు ఒక గొప్ప పాఠమని, రాబోయే ప్రపంచకప్‌కు సిద్ధమవ్వడంలో భాగంగానే తాము ఉద్దేశపూర్వకంగానే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగామని ఆయన స్పష్టం చేశాడు.మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. "మేము ఈ రోజు కావాలనే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు పక్కా బౌలర్లతో ఆడాము. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు, ఆరంభంలోనే వికెట్లు పడితే మిగిలిన వారు ఎలా ఆడతారో పరీక్షించాలనుకున్నాం. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. వరల్డ్ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వడం మా ప్రాధాన్యం" అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa